నన్ను మా అబ్బాయి అంటారు | Interview with Sree Vishnu about Maa Abbai | Sakshi
Sakshi News home page

నన్ను మా అబ్బాయి అంటారు

Mar 12 2017 11:16 PM | Updated on Sep 5 2017 5:54 AM

నన్ను మా అబ్బాయి అంటారు

నన్ను మా అబ్బాయి అంటారు

మాస్‌ హీరోగా పేరొస్తే... మళ్లీ డిఫరెంట్‌ సినిమాలు చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. నాకు అన్ని రకాల సినిమాలూ చేయాలనుంది.

‘‘మాస్‌ హీరోగా పేరొస్తే... మళ్లీ డిఫరెంట్‌ సినిమాలు చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. నాకు అన్ని రకాల సినిమాలూ చేయాలనుంది. నాకు పేరు రావడం కంటే... నేను చేసిన పాత్రలకు మంచి పేరొస్తే చాలనుకుంటున్నా’’ అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా కుమార్‌ వట్టి దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాశ్‌రావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న విడుదలవుతోంది. శ్రీవిష్ణు చెప్పిన సంగతులు...


ఓ రెండు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాలను వణికించింది. ఆ వాస్తవ ఘటన ఆధారంగా ‘మా అబ్బాయి’ తెరకెక్కింది. ఓ కామన్‌ కుర్రాడు తన కుటుంబ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడనేది కథ.

కొత్త కథతో తెరకెక్కిన చిత్రమని చెప్పను. కానీ, ఆరు పాటలు, ఫైట్స్‌తో తీసే కమర్షియల్‌ ఫార్ములా సినిమాల్లో ఇప్పటి వరకూ ఇలాంటి స్క్రీన్‌ప్లే రాలేదు. ‘మా అబ్బాయి’ కథనం చాలా కొత్తగా ఉంటుంది. ఫైట్స్, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కథలో భాగంగానే ఉంటాయి. ∙ఈ చిత్రంలో కాన్ఫిడెంట్‌గా ఉండే అబ్బాయి పాత్రలో కనిపిస్తా. ఏ విషయాన్నయినా ఓపెన్‌గా మాట్లాడతా. బాడీ లాంగ్వేజ్‌తో కాకుండా కళ్లతోనే ఎక్కువ నటించా. ఇందులో విశాఖ యాస ప్రయత్నించా.

బలగ ప్రకాశ్‌రావు వంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. నా కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రమిది. అంత బడ్జెట్‌లో తీస్తేనే కరెక్ట్‌. కానీ, సినిమా ప్రారంభించే టైమ్‌కి నాకంత మార్కెట్‌ లేదు. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమా తీయడానికి సిద్ధమైతే... నేను కొంచెం జంకాను. ఇబ్బందిగా అనిపించింది. కానీ, కథపై నమ్మకంతో ముందడుగు వేశాం.

నా పేరు ఎక్కువమంది ప్రేక్షకులకు తెలియదు. కొందరికి మాత్రమే తెలుసు. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ చేసినప్పుడు ‘రాయల్‌ రాజు’... ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చూసి ‘రైల్వే రాజు’ అన్నారు. ఇప్పుడీ ‘మా అబ్బాయి’ చూసిన తర్వాత ప్రేక్షకులు ‘మా అబ్బాయి’ అనే అంటారనుకుంటున్నా.

ఏ కథనైనా ఓ ప్రేక్షకుడిగానే వింటా. యువతకు ఉన్న సమస్యల్లో 80 శాతం కామన్‌గానే ఉంటాయి. కథలో పాయింట్‌ వాళ్లకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటే అంగీకరించేస్తా. ప్రస్తుతం ‘మెంటల్‌ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ సినిమాలు చేస్తున్నా. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ తర్వాత ప్రేక్షకుల్లో, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement