అవెంజర్స్‌ ఎదుర్కోబోయే సూపర్‌విలన్‌ థానోస్‌ | Infinity War Poster Leaves Out Thanos | Sakshi
Sakshi News home page

అవెంజర్స్‌ ఎదుర్కోబోయే సూపర్‌విలన్‌ థానోస్‌

Apr 16 2018 1:29 AM | Updated on Aug 11 2019 12:52 PM

Infinity War Poster Leaves Out Thanos - Sakshi

థానోస్‌

యంసీయు (మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌)లో చాలా తక్కువ టైమ్‌లోనే ఎక్కువ క్రేజ్‌ తెచ్చుకున్న సూపర్‌ విలన్‌ థానోస్‌. ఇదివరకు ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గ్యాలక్సీ, అవెంజర్స్‌ ఏజ్‌ ఆఫ్‌ ఆల్ట్రన్స్‌’ సినిమాల్లో కనిపించారు. అది కూడా పూర్తి స్థాయి పాత్రలో కాదు... కేవలం లిమిటెడ్‌ రోల్‌లో కనిపించారు.  కానీ, ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌’లో పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నారు థానోస్‌. అవెంజర్స్‌ అందరూ కలిసి ఈ విలన్‌ ఆకృత్యాలను అడ్డుకొని అతని మీద ఎలా గెలిచారన్నది ఈ సినిమా కథ.

థానోస్‌ క్యారెక్టర్‌ గురించి కెప్టెన్‌ అమెరికా క్యారెక్టర్‌ ప్లే చేసిన క్రిస్‌ ఈవన్‌ మాట్లాడుతూ – ‘‘అవెంజర్స్‌ ఎదుర్కోబోయే అతి పెద్ద సూపర్‌విలన్‌ థానోస్‌. అవెంజర్స్‌ ఫ్యాన్స్‌కు, థానోస్‌ ఫ్యాన్స్‌కు ఈ సినిమా సూపర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోంది. ఆ క్యారెక్టర్‌తో తలపడటాన్ని మేమెంతో ఎంజాయ్‌ చేశాం. అందరు సూపర్‌ హీరోస్‌ కలిసి ఒకే సినిమాలో కనబడటం మార్వెల్స్‌లో బెస్ట్‌ థింగ్‌’’ అని పేర్కొన్నారు. ‘అవెంజర్స్‌–ఇన్ఫినిటీ వార్‌’ సినిమా ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో థానోస్‌ క్యారెక్టర్‌కు హీరో రానా దగ్గుబాటి డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement