ఇండియన్ ఐడల్ విజేత సందీప్ ఆచార్య కన్నుమూత | Indian Idol 2 winner Sandeep Acharya dies of jaundice | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఐడల్ విజేత సందీప్ ఆచార్య కన్నుమూత

Dec 15 2013 6:45 PM | Updated on Apr 3 2019 8:07 PM

ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజేత సందీప్ ఆచార్య (29) మరణించాడు. పచ్చకామెర్ల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై అతడు ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశాడు.

ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజేత సందీప్ ఆచార్య (29) మరణించాడు. పచ్చకామెర్ల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై అతడు ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. గుర్గావ్ లోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఫలితం లేకపోయింది.

బికనీర్లో ఓ పెళ్లికి హాజరైనప్పుడు ఆచార్య ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. దాంతో అతడి బంధువులు వెంటనే మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల వల్లే ఇతర అనారోగ్యాలు కూడా తీవ్రంగా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. సందీప్ ఆచార్య మృతిపట్ల పలువురు ప్రముఖ గాయకులు సంతాపం తెలిపారు. గాయకులు శ్రేయా ఘోషల్, సోను నిగమ్ తదితరులు ట్విటర్ ద్వారా తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆచార్యకు భార్య, ఒక నెల వయసున్న కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement