థ్రిల్లింగ్ ఐస్ | In the horror genre | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్ ఐస్

Oct 7 2015 11:59 PM | Updated on Sep 3 2017 10:35 AM

థ్రిల్లింగ్ ఐస్

థ్రిల్లింగ్ ఐస్

మోక్ష’ తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ తెలుగు తెరపై కనబడలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె నటించిన చిత్రం ‘ద ఐస్’.

‘మోక్ష’ తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ తెలుగు తెరపై కనబడలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె నటించిన చిత్రం ‘ద ఐస్’. మలయాళంలో షాజియం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డి. వెంకటేశ్ అనువదించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది.. ‘‘ఒక అమ్మాయికి ఎదురైన విచిత్రమైన అనుభవాల నేపథ్యంలో మంచి థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. మీరాజాస్మిన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ విభ్నిమైన పాయింట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఎక్కడా డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలగదు. మలయాళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని డి. వెంకటేశ్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement