మళ్లీ తల్లి కానుందా? | imagination about Aishwarya Rai pregnancy | Sakshi
Sakshi News home page

మళ్లీ తల్లి కానుందా?

Apr 25 2014 10:56 PM | Updated on Sep 2 2017 6:31 AM

సినిమా తారలు చిక్కినా వార్తే! లావైనా వార్తే. ముఖ్యంగా కథానాయికలు బరువు పెరిగితే మాత్రం ‘సమ్‌థింగ్’ అనుకుంటారు. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్ గురించి అలానే మాట్లాడుకుంటున్నారు.

సినిమా తారలు చిక్కినా వార్తే! లావైనా వార్తే. ముఖ్యంగా కథానాయికలు బరువు పెరిగితే మాత్రం ‘సమ్‌థింగ్’ అనుకుంటారు. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్ గురించి అలానే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఓటేయడానికి బయటికొచ్చిన ఈ సుందరి నలుగురి కంట్లో పడ్డారు. ఆ మధ్య సన్నగా కనిపించిన ఐశ్వర్య ఇప్పుడు మాత్రం కాస్త బొద్దుగా కనిపించారు. ఆ మాత్రం చాలు ఊహాగానాలు చెలరేగడానికి. ఐశ్వర్యారాయ్ మళ్లీ అమ్మ కాబోతోందని, ఆమె శరీరాకృతి చూస్తే ఆ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఐశ్వర్య పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత ఐశ్వర్య సినిమాలేవీ అంగీకరించలేదు. వెండితెరపై ఆమె ఆగమనం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా, ప్రహ్లాద్ కక్కడ్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి ఆమె పచ్చజెండా ఊపారనే వార్తలు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు ఐష్ గర్భవతి అనే వార్త వచ్చింది. తమ అభిమాన కథానాయిక మరో బిడ్డకు జన్మనిస్తే.. అభిమానులకు ఆనందంగానే ఉంటుంది. కాకపోతే, వెండితెరపై ఆమెను మిస్ అవుతామనే బాధ కూడా ఉంటుంది. ఏదేమైనా ఐష్ గర్భవతి అనే వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement