అమ్మకానికి ఇలియానా ఇల్లు! | Ileana's House in Hyderabad for Sale | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఇలియానా ఇల్లు!

Sep 16 2014 12:43 AM | Updated on Sep 4 2018 5:07 PM

అమ్మకానికి ఇలియానా ఇల్లు! - Sakshi

అమ్మకానికి ఇలియానా ఇల్లు!

ఇలియానా దక్షిణాదికి టాటా చెప్పేసిందా?... ఔనన్నది కొందరి ఊహ. అలా ఊహించడానికి కారణం లేకపోలేదు. ‘బర్ఫీ’ చిత్రం ద్వారా రెండేళ్ల క్రితం హిందీ తెరపై మెరిసిన ఈ గోవా బ్యూటీ

 ఇలియానా దక్షిణాదికి టాటా చెప్పేసిందా?... ఔనన్నది కొందరి ఊహ. అలా ఊహించడానికి కారణం లేకపోలేదు. ‘బర్ఫీ’ చిత్రం ద్వారా రెండేళ్ల క్రితం హిందీ తెరపై మెరిసిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత దక్షిణాది వైపు కన్నెత్తి చూడలేదు. దాంతో.. ఇక ఇలియానాకి దక్షిణాది సినిమాలు చేసే ఉద్దేశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టు హైదరాబాద్‌లో ఎప్పుడో తాను కొన్న ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టిందట ఇలియానా.
 
 ఈ ఇంటి విలువ దాదాపు కోటిన్నర అని సమాచారం. ఒకవేళ దక్షిణాదిన సినిమాలు ఒప్పుకుంటే.. షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చి, వెళ్లిపోవచ్చని. అంతమాత్రం దానికి ఇక్కడ ఇల్లెందుకు? అని ఇలియానా అనుకుని ఉంటుంది. అందుకే తను కొన్న లగ్జరీ ఫ్లాట్‌ని అమ్మాలనుకుని ఉంటుంది. ఇలియానికి గోవాలో సొంత ఇల్లు ఉంది. హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ముంబయ్‌లో ఇల్లు కొనుక్కుందని భోగట్టా.
 

Advertisement
 
Advertisement
Advertisement