రామ్‌ చరణ్‌కు షాక్‌ ఇచ్చిన ఇలియానా..! | Ileana Demanded a Huge Price For An Item Number in VVR | Sakshi
Sakshi News home page

Nov 25 2018 10:46 AM | Updated on Nov 25 2018 10:46 AM

Ileana Demanded a Huge Price For An Item Number in VVR - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌కు క్రేజీ హీరోయిన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్‌.

దీంతో తాజాగా టాలీవుడ్‌లో అమర్‌ అక్బర్‌ ఆంటొని చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాను సంప్రదించారట. అయితే ఒక్క పాటకు ఇలియానా అడిగిన పారితోషికం విని చిత్రయూనిట్‌ షాక్‌ అయ్యింది. రామ్‌చరణ్ లాంటి స్టార్‌ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసేందుకు ఇలియానా ఏకంగా 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసారట. మరి VVR టీం అంత ఇచ్చి ఇలియానానే తీసుకుంటారా..? లేక మరో హీరోయిన్‌ను ట్రై చేస్తారా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement