చెడు మార్గంలో వెళ్తే...! | If we go in wrong route! | Sakshi
Sakshi News home page

చెడు మార్గంలో వెళ్తే...!

May 12 2014 10:43 PM | Updated on Sep 2 2017 7:16 AM

చెడు మార్గంలో వెళ్తే...!

చెడు మార్గంలో వెళ్తే...!

యువతరం మంచి బాటలో వెళ్లడానికి ఎన్ని మార్గాలున్నాయో, చెడు మార్గంలో వెళ్లడానికీ అన్నే ఉన్నాయి.

యువతరం మంచి బాటలో వెళ్లడానికి ఎన్ని మార్గాలున్నాయో, చెడు మార్గంలో వెళ్లడానికీ అన్నే ఉన్నాయి. ప్రధానంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న అంశాలేంటి? అనే కథాంశంతో అంజి శ్రీను దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా, నాన్న... ఊరెళితే’. గాజుల ఖాదర్ భాష నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సోనియా అగర్వాల్ ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు. సెన్సార్ పరంగా ఈ చిత్రానికి పలు సమస్యలు ఎదురయ్యాయని నిర్మాత చెబుతూ -‘‘సెన్సార్ సమస్యల వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. అమ్మా, నాన్న ఊరెళితే ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందేనని దర్శకుడు తెలిపారు. సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత తదితరులు నటించిన ఈ చిత్రానికి సహనిర్మాతలు: సలామ్, అశోక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement