వంట నేర్చుకోను

I will never learn cooking says vidya balan - Sakshi

విద్యా బాలన్‌కు వంట రాదు. నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. అయినా ఆసక్తి లేని పనులను పనికట్టుకుని చేయడం ఎందుకూ? అంటారామె. 2012లో నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు విద్యాబాలన్‌. పెళ్లయిన వెంటనే విద్యా వాళ్ల అమ్మ ‘ఇప్పుడైనా వంట నేర్చుకో..’ అని సలహా ఇచ్చారట. ‘‘ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాను. కావాలంటే వంటవాళ్లను పెట్టుకుంటాను.

వాళ్లు లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటా. లేదా బయటకు వెళ్లి తింటా. నాకు వంటా వార్పు మీద ఆసక్తి లేదు’ అని తల్లికి బదులిచ్చారు. అది మాత్రమే కాదు.. ‘‘వంట నేర్చుకో అని నాకు చెప్పే బదులు వంట వచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవచ్చుగా అని ఎందుకు చెప్పడం లేదు’ అని తిరిగి ప్రశ్నించారు కూడా. ‘‘వీళ్లు ఈ పని కచ్చితంగా చేయాలి’’ అని తరతరాలుగా వస్తున్న ఈ ఆలోచనా విధానాన్ని నేను పట్టించుకోను. నా భర్త కూడా నా ఆలోచనలను అర్థం చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యా బాలన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top