ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నా | I hope to see you as the Chief Minister, Mohan babu on MK Stalin | Sakshi
Sakshi News home page

Aug 27 2018 2:22 PM | Updated on Aug 27 2018 4:24 PM

I hope to see you as the Chief Minister, Mohan babu on MK Stalin - Sakshi

డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని...

సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ప్రముఖ నటుడు మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ ఆదివారం కోయంబత్తూరులో జరిగింది. ఈ  కార్యక్రమానికి హాజరైన విషయాన్ని మోహన్‌బాబు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

కరుణానిధి తనయుడు స్టాలిన్‌ ఆహ్వానం మేరకు తాను ఈ సంస్మరణ సభలో పాల్గొన్నానని, ఈ సభకు తనను ఆహ్వానించినందుకు సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ.. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement