ప్రేమలో పడదామన్నా టైం లేదు : తమన్నా
‘‘నా జీవితంలో ‘క’ అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంది’’ అంటున్నారు తమన్నా. అదేంటి? అనడిగితే - ‘‘క్రమశిక్షణ, కృషి... ఈ రెండూ క అక్షరంతోనే మొదలవుతాయి కదా.
‘‘నా జీవితంలో ‘క’ అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంది’’ అంటున్నారు తమన్నా. అదేంటి? అనడిగితే - ‘‘క్రమశిక్షణ, కృషి... ఈ రెండూ క అక్షరంతోనే మొదలవుతాయి కదా. ఈ రెండూ ఉండటంవల్లే కథానాయికగా నేనీ స్థాయికి చేరుకోగలిగాను. సినిమా పరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్ లేరు కాబట్టి, కష్టాన్ని నమ్ముకుని ఇక్కడికొచ్చాను.
ఓ పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టపడాలో అంతా పడతాను’’ అన్నారీ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. బ్యాంక్ బాలెన్స్ బాగా పెరుగుతోంది కదా.. మరి ఆర్థిక వ్యవహారాల్లో మీరెంతవరకు బెస్ట్ అనే ప్రశ్న తమన్నా ముందుంచితే - ‘‘చాలా బెస్ట్. సూపర్ మార్కెట్‌కి వెళ్లిపోయి కంటికి నచ్చినదల్లా కాకుండా నాక్కావల్సిన వాటినే కొనుక్కుంటాను. డ్రెస్సులు కూడా అంతే. నాక్కావల్సినవే కొంటా. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం ఉండదు.
చాలావరకు పొదుపుగానే ఉంటా’’ అని చెప్పారు. అది సరే.. ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? అనే ప్రశ్నకు - ‘‘ఎప్పుడూ లేదు. ఇప్పుడు పడదామన్నా నాకు టైమ్ లేదు. సినిమాలతో బిజీ. మీకో విషయం చెప్పనా? నాక్కాబోయే భర్త ఇలా ఉండాలని ఎప్పుడూ ఊహించుకోలేదు. దానిక్కూడా ఓ టైమ్ రావాలని నా ఫీలింగ్. ఏది ఎప్పుడు జరగాలని రాసి పెట్టి ఉంటే అప్పుడు జరుగుతుంది’’ అన్నారు తమన్నా.