నాకా భయం లేదు! | i don't scare about it! | Sakshi
Sakshi News home page

నాకా భయం లేదు!

Feb 27 2015 10:27 PM | Updated on Oct 1 2018 5:19 PM

నాకా భయం లేదు! - Sakshi

నాకా భయం లేదు!

ఎలాంటి చీకూ చింతా లేకుండా హాయిగా బతకాలంటే.. మంచి కుటుంబం, ఓ సొంత ఇల్లు, కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు. దీపికా పదుకొనేకి ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి.

ఎలాంటి చీకూ చింతా లేకుండా హాయిగా బతకాలంటే.. మంచి కుటుంబం, ఓ సొంత ఇల్లు, కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు. దీపికా పదుకొనేకి ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇలా అన్నీ ఉన్న చోట మిడిసిపాటు సహజం. కానీ, దీపికా ఆ బాపతు కాదని హిందీ రంగంలో అంటుంటారు. గుడ్ గాళ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నిరాడంబరత గురించి చెబుతూ - ‘‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అసలీ రోజున్న హోదా రేపు ఉంటుందో ఉండదో.

ఆ మాటకొస్తే... జీవితాంతం నేను స్టార్ హీరోయిన్‌గా ఉంటానా చెప్పండి? రేపు నా స్థానంలో ఇంకొకరు.. ఆ తర్వాత వాళ్ల స్థానంలో మరొకరు.. కాలచక్రంలో స్థానాలు మారిపోతాయ్. అందుకే ‘రేపు స్టార్‌డమ్ పోతే ఎలా?’ అని అదే పనిగా ఆలోచించి, భయపడను. ఎందుకంటే, ఎలాగూ పోవడం ఖాయం. ఈ మాత్రం దానికి ‘అంతా నేనే’ అని మిడిసిపడడం ఎందుకు? అదే గనక మనం నిరాడంబరంగా ఉంటే నలుగురు స్నేహితులు ఉంటారు. మనకు స్టార్‌డమ్ ఉన్నా లేకపోయినా వాళ్లు మనతో పాటే ఉంటారు. ఏమంటారు?’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement