సుసానే ఫోటోను షేర్‌ చేస్తూ.. హృతిక్‌ ఆసక్తికర కామెంట్స్‌! | Hrithik Roshan Shares Sussanne Khan Photo In Instagram | Sakshi
Sakshi News home page

Nov 26 2018 5:02 PM | Updated on Nov 26 2018 5:04 PM

Hrithik Roshan Shares Sussanne Khan Photo In Instagram - Sakshi

బాలీవుడ్‌లో పెళ్లి సందడి జోరుగా సాగుతున్న వేళలో మనస్పర్ధలతో విడిపోయిన హృతిక్‌ రోషన్‌, సుసానే ఖాన్‌లు మళ్లీ ఒకటవ్వనున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బాల్య స్నేహితులైన వీరు వివాహబందంతో ఒక్కటై దాదాపు దశాబ్దం పాటు కాపురం చేసి..2014లో చట్టబద్దంగా విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్‌కు దగ్గరవ్వడంతో భార్య సుసానే ఖాన్‌కు హృతిక్‌ రోషన్‌ విడాకులు ఇచ్చాడు.

హృతిక్‌, సుసానేలు విడిపోయినా..తమ పిల్లలకోసం తరుచూ కలుస్తుంటారు. పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. అయితే కంగనా రనౌత్‌తో హృతిక్‌కు బేదాభిప్రాయాలు రావడంతో వీరిద్దరు కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. ఇవన్నీ పాత విషయాలే కానీ.. మళ్లీ ఇప్పుడు చర్చించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే హృతిక్‌ సోషల్‌ మీడియాలో తన మాజీ భార్య సుసానే ఖాన్‌ ఫోటోను షేర్‌ చేస్తూ.. చేసిన సుదీర్ఘ కామెంట్స్‌ను చూస్తే త్వరలోనే మళ్లీ ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారని అభిమానులు అనుకుంటున్నారు. 

‘ఇక్కడ ఉన్నది సుసానే. నా క్లోజెస్ట్‌ ఫ్రెండ్‌ ( నా మాజీ భార్య కూడా) నన్ను మా పిల్లలను ఫోటో తీస్తోంది. ఈ మూమెంట్‌ మా పిల్లలకు ఒక స్టోరీని చెబుతోంది. ఎన్నో రకాలుగా మరెన్నో ఆలోచనలుగా విడిపోయిన  ఈ ప్రపంచంలో ఒక్కటిగా కలిసిఉండటం సాధ్యమే. మనుషులుగా మనకు ఎన్ని విభిన్న ఆలోచనలు ఉన్నా.. విడిపోకుండా ఉండగలం. ఈ ప్రపంచంలో ధైర్యంగా, సహనపూర్వకంగా, ఐకమత్యంగా, ప్రేమగా ఉండాలి. ఇవన్నీ ఇంటి (కుటుంబం) నుంచే ప్రారంభం అవుతాయి.’ అంటూ ధైర్యంగా ఉండాలి, ఓపెన్‌గా ఉండాలి, భయం కంటే ప్రేమే గొప్పది, పిల్లలే భవిష్యత్తు వంటి హ్యాష్‌ట్యాగ్‌లను షేర్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement