హిచ్కీ టీచర్‌.. రాణి ఈజ్‌ బ్యాక్‌! | How Rani Mukerji Prepares For Her Role | Sakshi
Sakshi News home page

హిచ్కీ టీచర్‌.. రాణి ఈజ్‌ బ్యాక్‌!

Dec 28 2017 12:51 AM | Updated on Apr 3 2019 6:23 PM

 How Rani Mukerji Prepares For Her Role  - Sakshi

‘‘నాకు తెలిసి మాట్లాడడంలో ఇబ్బంది పడేవారు టీచర్లు అయినట్టు ఎక్కడా లేదు’’ అంటాడు ప్రిన్సిపాల్, తమ స్కూల్లో టీచర్‌ ఉద్యోగం కోసం వచ్చిన హీరోయిన్‌తో! ‘‘కానీ నాకు టీచర్‌ అవ్వాలన్నదే డ్రీమ్‌’’ అంటుంది హీరోయిన్‌. హీరోయిన్‌కేమో మాట్లాడడం సరిగ్గా రాదు. మాట్లాడలేదు. టోరెట్‌ సిండ్రోమ్‌ ఆమెకు. నత్తిలాంటి ఒకరకం లోపం. ఎక్కిళ్లు వచ్చినట్టుగా ఉంటూ, మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటి ఒక టీచర్‌ పాఠాలు చెప్తే విద్యార్థులు ఎలా ఉంటారు? అసలు ఆమె మాటను పట్టించుకుంటారా? ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఈ కథతో హిచ్కి (ఎక్కిళ్లు అని..) అనే ఓ సినిమా వస్తోంది.

ఆ హీరోయిన్‌ పాత్రలో కనిపిస్తోంది ఎవరో కాదు.. మన రాణి ముఖర్జీ. కెరీర్‌ రెండో దశలో థ్రిల్లర్స్‌తో మెప్పించిన ఆమె, కూతురు పుట్టాక సినిమాలకు దూరమయింది. ఇక ఇప్పుడు మళ్లీ అన్నీ సెట్‌ చేస్కొని, ఒక కొత్త కథాంశంతో హిచ్కీ అంటూ వచ్చేస్తోంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సిద్ధార్థ్‌ మల్హోత్రా దర్శకుడు. నటనలో తనదైన బ్రాండ్‌ సృష్టించుకున్న రాణి, ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటూ, ఒక స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇస్తారని ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 23, 2018న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement