'ఆమెను వెళ్లనివ్వకండి' | How Not to Lose 'Goddess' Kangana Ranaut | Sakshi
Sakshi News home page

'ఆమెను వెళ్లనివ్వకండి'

Aug 11 2016 5:00 PM | Updated on Sep 28 2018 7:36 PM

మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

లక్ష్మీదేవిని వెళ్లనివ్వకండి,ఇంట్లోనే కొలువై ఉండనివ్వండి..అంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బిగ్ బీ కూడా అదే చెబుతున్నారు. ఇంతకీ లక్ష్మీదేవి ఎందుకు వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అసలు కంగనా.. లక్ష్మీదేవి అవతారంలో ఎందకు కనిపిస్తుంది? తెలియాలంటే.. తెలుసుకోవాలి మరి.

మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు బోలెడంత ప్రచారం కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బీ అమితాబ్, క్వీన్ కంగనాలు 'స్వచ్ఛ్ భారత్'కు ప్రచారకర్తలుగా ఉన్నారు. పరిశుభ్రత ఆవశ్యకతను అర్థమయ్యేలా వివరిస్తూ కంగనా నటించిన 'డోన్ట్ లెట్ హర్ గో' వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

పరిసరాలను పరిశభ్రంగా ఉంచుకోకపోతే మనం ధన దేవతగా కొలిచే 'లక్ష్మీదేవి' మన నుంచి ఎలా వెళ్లిపోతుందనేది వినోదాత్మకంగా చిత్రీకరించారు. 'పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్' విభాగం విడుదల చేసిన ఈ వీడియోలో కంగనా లక్ష్మీదేవిగా కనిపిస్తుంది. రెండున్నర నిముషాల నిడివి గల ఈ వీడియో 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమ లక్ష్యాన్ని, పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తుంది. యూ ట్యూబ్లో ఇప్పటికే లక్షమందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. మరి మీరూ చూసి.. ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకోండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement