రివ్యూలు పెదవి విరిచినా.. భారీ వసూళ్లు! | Housefull 4 Movie Earns Rs 37.89 Crore | Sakshi
Sakshi News home page

రివ్యూలు పెదవి విరిచినా.. భారీ వసూళ్లు!

Oct 27 2019 4:09 PM | Updated on Oct 27 2019 4:28 PM

Housefull 4 Movie Earns Rs 37.89 Crore - Sakshi

ముంబై: అక్షయ్‌కుమార్‌ తాజా సినిమా ‘హౌజ్‌ఫుల్‌-4’.... సూపర్‌హిట్‌ కామెడీ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన హౌజ్‌ఫుల్‌ సినిమాల్లో ఇది నాలుగో సినిమా. ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. తాజా సీక్వెల్‌లో అక్షయ్‌కుమార్‌తోపాటు బాబీడియోల్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, కృతీ సనన్‌, పూజా హెగ్డే, కృతి కర్బంద, దగ్గుబాటి రానా వంటి స్టార్‌ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పట్ల విమర్శకులు పెదవి విరిచారు. ఈ కామెడీ సినిమా అంతగా నవ్వించేలా లేదని, హాస్యం కంటే అర్థంలేని వెర్రితనమే ఎక్కువగా ఉందని రివ్యూలు వచ్చాయి. అయినా, బాక్సాఫీస్‌ వద్ద అక్షయ్‌ సినిమా మరోసారి మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తోంది. తొలిరోజు రూ. 19.08 కోట్లు వసూలు చేసిన హౌజ్‌ఫుల్‌-4.. రెండోరోజు రూ. 18.81 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండురోజుల్లో ఈ సినిమా 37.89 కోట్లు వసూలు చేసింది. దీపావళి పండుగ సీజన్‌లో ఈ స్థాయిలో వసూళ్లు రావడం గొప్ప విషయమేనని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తే.. సూపర్‌హిట్‌ అయ్యే అవకాశముందని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement