మ్యాడసన్‌ @ సైలెన్స్‌

Hollywood actor Michael Madsen in Anushka film - Sakshi

అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ముఖ్య తారలుగా హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించనున్న చిత్రం ‘సైలెన్స్‌’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించనున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడసన్‌ నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘కిల్‌ బిల్, హేట్‌ఫుల్‌ ఎయిట్, రిసర్వోయర్‌ డాగ్స్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు

మ్యాడసన్‌. ‘‘టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. ఓ వినూత్నమైన సినిమాను చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని ఆశిస్తున్నాం. యూఎస్‌ఏలోని సీయోటల్‌లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు చిత్రీకరణ జరపబోతున్నాం. ఈ సినిమా టీజర్‌ను మేలో యు.ఎస్‌.ఏలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top