అర్జున్‌ రెడ్డి చిత్రం దశ మార్చేసింది..! | Heroine Shalini Paday romance with hero Jeeva | Sakshi
Sakshi News home page

అర్జున్‌ రెడ్డితో అవకాశాలు పెరిగాయి

Dec 1 2017 7:20 PM | Updated on Dec 2 2017 4:15 AM

Heroine Shalini Paday romance with hero Jeeva - Sakshi

ఒక సక్సెస్‌ హీరోయిన్‌ శాలిని పాండేను టాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది.  అర్జున్‌రెడ్డి సినిమా ఆమె దశను మార్చేసింది. రంగస్థల నటి అయిన శాలిని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అక్కడ మహానటి సావిత్రి జీవిత్ర చరిత్రగా తెరకెక్కుతున్న మహానది చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాక తెలుగులో విజయాన్ని సాధించిన 100% లవ్‌ చిత్ర తమిళ రీమేక్‌లో తమన్నా పాత్రను చేసే లక్కీఛాన్స్‌ను కొట్టేసింది.

ఈ బ్యూటీ కోలీవుడ్‌లో స్థిరపడాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై శాలిని స్పందిస్తూ.. అర్జున్‌ రెడ్డి చిత్రం తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటానని పేర్కొంది. తమిళంలో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్న మాజ నిజమేనని ఆమె చెప్పింది. 100% కాదల్‌ చిత్రం పూర్తి అయిన తర్వాత జీవాతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతుందనే కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement