హీరోయిన్‌ అనుష్క మూగబాసలు

Heroine Anushka Learns ASL for Silence Movie - Sakshi

ముద్దబంతి పువ్వులో మూగ బాసలు అని పాటలో విన్నాం. ఇక హీరోయిన్‌ అనుష్క మూగబాసలు చూడబోతున్నాం. అవును అనుష్కను వెండితెరపై చూసి ఏడాది పైనే అవుతోంది. ఇది ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అవుతుంది. భాగమతి తరువాత ఏ చిత్రంలోనూ నటించని ఆ స్వీటీ పెరిగిన తన బరువును తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడిందనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. అంతే కాదు ఆ మధ్య ఆలయ దర్శనం చేసుకుంటే, అనుష్క దోశ నివారణ పూజలు నిర్వహించిందని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందనిలాంటి నిరాధార వార్తలు ప్రచారం అయ్యాయి. 

అయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోని ఈ బ్యూటీ ఆ మధ్య బరువు తగ్గడం కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రయత్నం ఫలించి నాజూగ్గా రెట్టించిన అందాన్ని పోగేసుకుని తిరిగొచ్చింది. తాజాగా సైలెన్స్‌ అనే త్రిభాషా చితంలో నటించడానికి సిద్ధమైంది. మాధవన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు రానా అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్న ఇందులో నటి అనుష్క మూగ, చెవుడు కలిగిన యువతిగా నటించబోతోందట. ఇందుకుగానూ ఈ అమ్మడు మూగ భాషలో శిక్షణ పొందుతోంది. అమెరికాలో మూగ భాషలో తర్ఫీదు తీసుకుంటుందని  సమాచారం.అసలు మాటలే లేకుండా తన సైగలతో, ముఖ కవళికలతో సైలెన్స్‌ చిత్రం ద్వారా అలరించడానికి ఈ బ్యూటీ తయారవుతోందన్నమాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top