'ఎంసీఏ'కు నాని సరికొత్త నిర్వచనం.. వైరల్!

Hero Nani Christmas wishes with MCA title - Sakshi

సాక్షి, హైదరాబాద్: నాని హీరోగా తెరకెక్కి ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న మూవీ ‘ఎంసీఏ’. ఇప్పటివరకూ ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ మధ్య తరగతి ప్రేక్షకులను, మాస్ క్లాస్ ఆల్ అంటూ అన్ని వర్గాల ఆడియన్స్‌కు చేరువైంది ఎంసీఏ మూవీ. అయితే నేడు పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా హీరో నాని ఎంసీఏకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఎంసీఏ-- 'మెర్రీ క్రిస్మస్ అందరికీ' అంటూ వినూత్నంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నాని ట్వీట్ చేశారు. నాని ట్వీట్ చేసిన గంటలోనే వేల కొద్ది లైక్స్, రీట్వీట్స్‌తో ఆ పోస్ట్ వైరల్ అయింది.

సినిమాను ప్రమోట్ చేసుకున్నప్పటికీ మంచి ఉద్దేశంతో క్రిస్టియన్ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడంటూ నాని ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి నటించగా, భూమిక, రాజీవ్ కనకాల, ఆమని, నరేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బాణీలకు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top