వారసత్వంపై యంగ్‌ హీరో క్లారిటీ..! | hero manchu vishnu tweet about heir | Sakshi
Sakshi News home page

వారసత్వంపై యంగ్‌ హీరో క్లారిటీ..!

Dec 31 2017 8:58 AM | Updated on Apr 4 2019 4:44 PM

hero manchu vishnu tweet about heir - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులకు కవలలు జన్మించనున్నారట. కొడుకు పుడితే వారసుడు పుట్టాడని అంటారు. ఈ విషయంపై మంచు విష్ణు స్పందించి ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. 

‘ చాలా మంది నాకు కొడుకు పుడితే వారసుడుంటాడు అని మెసేజెస్‌ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదల్చుకున్నా.. నాకు ఇద్దరు వారసురాళ్ళు ఉన్నారు.. అరియానా, వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదు.’ అని మంచు విష్ణు తన అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు.

ప‍్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాక మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement