ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్

ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్


చిన్నప్పట్నుంచీ నాన్నే ఆ అమ్మాయి జీవితం. వయసొచ్చిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు బాయ్‌ఫ్రెండ్స్ పేరుతో ఆమె జీవితంలోకి వస్తారు. ఎవరా ముగ్గురు? వాళ్లపై ఆమె తండ్రి అభిప్రాయం ఏంటి? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’. బండి భాస్కర్ దర్శకత్వంలో రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, పార్వతీశం, అశ్విన్‌బాబు, నోయెల్ ముఖ్యతారలుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘సినిమా బాగా నచ్చి ‘దిల్’ రాజుగారు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది’’ అని నిర్మాత తెలిపారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top