మెగా హీరోతో 'కుమారి' | Hebah Patel bags Mega offer | Sakshi
Sakshi News home page

మెగా హీరోతో 'కుమారి'

Mar 18 2016 4:52 PM | Updated on Sep 3 2017 8:04 PM

మెగా హీరోతో 'కుమారి'

మెగా హీరోతో 'కుమారి'

'నా పేరు కుమారి, ఏజ్ 21.. ఐ యామ్ ఫీమేల్, ఏ.. లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా.. నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కావాలా' అంటూ కుమారి 21f తో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసిన హెబా పటేల్ మాంచి హుషారు మీదుంది.

'నా పేరు కుమారి,  ఏజ్ 21.. ఐ యామ్ ఫీమేల్,  ఏం.. లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా.. నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కావాలా' అంటూ కుమారి 21f తో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసిన హెబా పటేల్ మాంచి హుషారు మీదుంది. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న హెబాను మరో క్రేజీ ఆఫర్ వరించిందట. మెగా హీరో వరుణ్ తేజ్ తదుపరి చిత్రంలో ఓ ముఖ్య పాత్రకు హెబాను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న ఆ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా మరో ఆసక్తికర పాత్రలో హెబా కనిపించనుందని టాక్.

ప్రస్తుతం మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు కలిసి నటిస్తున్న 'ఆడో రకం ఈడో రకం' సినిమాలో రాజ్ తరుణ్ కు జంటగా నటిస్తుండగా, నిఖిల్ హీరోగా మరో సినిమాకు సంతకం చేసింది. తాజాగా మెగా హీరో సినిమాలో అవకాశం మాట నిజమే అయితే ఇక కుమారి దశ తిరిగినట్టే.

Advertisement
 
Advertisement
Advertisement