స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో ఐదోసారి... | Harrison Ford, Steven Spielberg Return for a Fifth Indiana Jones Movie | Sakshi
Sakshi News home page

స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో ఐదోసారి...

Mar 16 2016 10:41 PM | Updated on Sep 3 2017 7:54 PM

స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో ఐదోసారి...

స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో ఐదోసారి...

హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ హిట్ మూవీల లిస్ట్‌లో ‘ఇండియానా జోన్స్’ పేరు కచ్చితంగా ఉంటుంది.

 హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ హిట్ మూవీల లిస్ట్‌లో ‘ఇండియానా జోన్స్’ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రపంచానికి అందకుండా చారిత్రక శిథిలాల్లో మిగిలిపోయిన అద్భుతమైన వస్తువుల కోసం అన్వేషించే ఓ పురావస్తు శాఖ అధ్యాపకుని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటికీ నాలుగు భాగాలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర కనకర్షం కురిపించాయి. హాలీవుడ్ సూపర్‌స్టార్ హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించారు.  ఇప్పుడు అయిదో భాగాన్ని కూడా నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ వరల్డ్ సన్నాహాలు చేస్తోంది.  ఎనిమిదేళ్ల విరామం తర్వాత  వస్తున్న ఈ భాగాన్ని కూడా స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తెరకెక్కించనున్నారు. 2019లో ఈ అయిదో భాగాన్ని  విడుదల చేయనున్నట్లు డిస్నీ సంస్థ ప్రకటించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement