హంసానందిని పంతం | Hamsa Nandini signs her next film opposite Gopichand in Pantham | Sakshi
Sakshi News home page

హంసానందిని పంతం

Feb 22 2018 12:10 AM | Updated on Feb 22 2018 12:10 AM

Hamsa Nandini signs her next film opposite Gopichand in Pantham - Sakshi

హంసానందిని

యాక్షన్‌ హీరో గోపీచంద్‌తో హంసానందిని ‘పంతం’ పట్టారు. గోపితో ఆమె పంతం పట్టాల్సినంత వైరం ఏంటి? అనేగా మీ డౌట్‌. ఇక్కడ పంతం అన్నది రియల్‌ లైఫ్‌లో కాదు రీల్‌ లైఫ్‌లో అన్నమాట. ఇంకా అర్థం కాలేదా?. గోపీచంద్, మెహరీన్‌ జంటగా చక్రి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. గోపి కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో హంసానందిని ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. గతంలో ‘లౌక్యం’ సినిమాలో గోపీచంద్‌తో ఐటమ్‌ సాంగ్‌ చేశారీ బ్యూటీ.

అయితే.. ‘పంతం’ సినిమాలో మాత్రం ఐటమ్‌ సాంగ్, అతిథి పాత్రలాంటివి కావట. హంసా కెరీర్‌లో బాగా గుర్తింపు తెచ్చేలా ఈ పాత్ర ఉంటుందట. ‘‘చక్రి చెప్పిన కథ బాగా నచ్చింది. బాగా డబ్బున్న అమ్మాయిగా క్లాసీ లుక్‌లో కనిపిస్తా. నటిగా నన్ను నేను కొత్తగా చూసుకునే  పాత్ర ఇది. చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశా ’’ అన్నారు హంసానందిని. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో విడు దల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement