breaking news
Hamsanandini
-
హంసానందిని పంతం
యాక్షన్ హీరో గోపీచంద్‌తో హంసానందిని ‘పంతం’ పట్టారు. గోపితో ఆమె పంతం పట్టాల్సినంత వైరం ఏంటి? అనేగా మీ డౌట్. ఇక్కడ పంతం అన్నది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో అన్నమాట. ఇంకా అర్థం కాలేదా?. గోపీచంద్, మెహరీన్ జంటగా చక్రి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. గోపి కెరీర్లో ఇది 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో హంసానందిని ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. గతంలో ‘లౌక్యం’ సినిమాలో గోపీచంద్‌తో ఐటమ్ సాంగ్ చేశారీ బ్యూటీ. అయితే.. ‘పంతం’ సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్, అతిథి పాత్రలాంటివి కావట. హంసా కెరీర్లో బాగా గుర్తింపు తెచ్చేలా ఈ పాత్ర ఉంటుందట. ‘‘చక్రి చెప్పిన కథ బాగా నచ్చింది. బాగా డబ్బున్న అమ్మాయిగా క్లాసీ లుక్‌లో కనిపిస్తా. నటిగా నన్ను నేను కొత్తగా చూసుకునే పాత్ర ఇది. చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశా ’’ అన్నారు హంసానందిని. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో విడు దల కానుంది. -
సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు...
‘‘ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇది’’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లౌక్యం’. ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఐటెమ్ సాంగ్‌ను హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. ‘సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు’ అనే చంద్రబోస్ విరచిత గీతాన్ని శంకర్ నృత్య దర్శకత్వంలో గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్, హంసానందిని, చంద్రమోహన్, బ్రహ్మానందం, సంపత్‌రాజ్, ప్రగతి తదితరులపై చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి కుటుంబ తరహా వినోదాత్మక చిత్రమిది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్ కాంబినేషన్లో నేను చేస్తున్న సినిమా ఇది. యూరప్‌లో 3 పాటలు చిత్రీకరించబోతున్నాం. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘సరైన పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందుతున్న సమయంలో ఇందులో నాకు మంచి పాత్ర దొరికింది. నాతో తొలి సినిమా చేసిన నాయికలే కాదు, నాయకులు కూడా విజయం సాధించారనడానికి నాగార్జున, గోపీచంద్లే ఉదాహరణ’’ అని చంద్రమోహన్ చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సంపత్‌రాజ్, ప్రగతి, హంసానందిని తదితరులు మాట్లాడారు.