షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు | gv prakash met with an accident | Sakshi
Sakshi News home page

షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు

Mar 29 2016 9:48 AM | Updated on Apr 3 2019 7:53 PM

షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు - Sakshi

షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు

సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తరువాత హీరోగా మారిన తమిళ స్టార్ జివి ప్రకాష్ కుమార్కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న జివి చిన్నపాటి గాయాలతో...

సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తరువాత హీరోగా మారిన తమిళ స్టార్ జివి ప్రకాష్ కుమార్   సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ఆయన  స్వల్పంగా గాయపడ్డారు.  చిన్నపాటి గాయాలతో జీవీ బయటపడంతో  చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.  ప్రస్తుతం జీవీ ప్రకాష్ 'కడవుల్ ఇరుక్కన్ కుమార' అనే తమిళ సినిమాలో హీరోగా  నటిస్తున్నారు. జీవీ  ప్రకాష్, ఆర్జే బాలజీలపై పాండిచ్చేరిలో  పోరాట సన్నివేశాలు  చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తమిళ దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిక్కి గల్రానీ, అవికాగోర్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి గత సినిమాల మాధిరిగానే ఈ సినిమాను కూడా రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జివి ప్రకాష్ నటించిన 'నాకు ఇంకో పేరుంది' సినిమా టాలీవుడ్లో రిలీజ్కు రెడీగా ఉండగా, ఈ  మూవీని  కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement