
బ్రూస్‌లీలో జీవీ ఫైట్స్ చేయలేదు
బ్రూస్‌లీ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ ఎలాంటి ఫైట్ సన్నివేశాల్లోనూ నటించలేదని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ పాండిరాజ్ వెల్లడించారు.
బ్రూస్‌లీ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ ఎలాంటి ఫైట్ సన్నివేశాల్లోనూ నటించలేదని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ పాండిరాజ్ వెల్లడించారు. ఈయన కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న చిత్రం బ్రూస్‌లీ.జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ద్వారా క్రితి కర్బాండా నాయకిగా పరిచయం అవుతున్నారు. బాలశరవణన్, మునీశ్‌కాంత్, ఆనంద్‌రాజ్, మన్సూర్ అలీఖాన్, నాన్‌కడవుల్ రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కెనన్యా ఫిలింస్, లింగాభైరవా క్రియేషన్స్, పీకే.ఫిలిం ఫ్యాక్టరీ సంస్థల అధినేతలు సెల్వకుమార్, పి.రవిచంద్రన్, జి.విటల్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రూస్‌లీ చిత్ర గీతాలు, ప్రచార చిత్రం ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ పాండిరాజ్ మాట్లాడుతూ బ్రూస్‌లీ అన్న టైటిల్ చూసి ఇదేదో భారీ యాక్షన్ కథా చిత్రం అని ఊహించుకోవద్దన్నారు. అసలు ఇందులో జీవీ ఫైట్ సన్నివేశాల్లోనే నటించలేదని చెప్పారు. అయినా ఈ చిత్రం ఆయన స్థాయిని మరింత పెంచుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్రూస్‌లీ పూర్తిగా వినోదభరిత కథా చిత్రం అని తెలిపారు. చిత్ర టైటిల్ చెప్పగానే వ్యత్యాసంగా ఉందే అని జీవీ నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. జీవీ మాట్లాడుతూ బ్రూస్‌లీ తమిళ హీరో హాలీవుడ్ విలన్ కథ అని దర్శకుడు చెప్పగా చాలా కొత్తగా ఉందే అని నటించడానికి సమ్మతించానని తెలిపారు. పసంగ పాండియన్, నిర్మాత జే.సెల్వకుమార్, పి..రవిచంద్రన్, జె.విఠల్‌కుమార్ పాల్గొన్నారు.