ఎంత ఘాటు ప్రేమయో..! | Guru first look: Venkatesh in rugged avatar for his next, see posters | Sakshi
Sakshi News home page

ఎంత ఘాటు ప్రేమయో..!

Sep 19 2016 11:40 PM | Updated on Sep 4 2017 2:08 PM

ఎంత ఘాటు ప్రేమయో..!

ఎంత ఘాటు ప్రేమయో..!

ఆ పేరుతో పిలిస్తే వెంకటేశ్‌కి పిచ్చ కోపం వస్తుంది. వయసును గుర్తు చేస్తూ పిలిస్తే మరి కోపం రాదూ! ఇంతకీ ఆ పేరేంటి అనుకుంటున్నారా

ఆ పేరుతో పిలిస్తే వెంకటేశ్‌కి పిచ్చ కోపం వస్తుంది. వయసును గుర్తు చేస్తూ పిలిస్తే మరి కోపం రాదూ! ఇంతకీ ఆ పేరేంటి అనుకుంటున్నారా..? ‘పెళ్లి కాని ప్రసాద్’. పైన చెప్పిన కోపమంతా తెరపైనే. ‘మల్లీశ్వరి’లో పెళ్లి వయసు దాటేసిన వ్యక్తిగా వెంకటేశ్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి అటువంటి పాత్రలోనే నటించనున్నారు. వెంకటేశ్, నిత్యా మీనన్ జంటగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’. ‘‘ప్రేమకు వయసుతో పనేముంది? మనసుతోనే కదా.
 
  వయసులో వ్యత్యాసం కల ఇద్దరి మనసులు కలిస్తే.. ప్రేమలో పడితే...’’ అనే వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అంతే కాదండోయ్... వెంకీ, నిత్యా ఏజ్ గ్యాప్ మీద దర్శకుడు బోలెడన్ని వినోదాత్మక సన్నివేశాలు రాశారట. ఆ ఫన్నీ ప్రేమకథ, సెటైరికల్ డైలాగులు వెంకీకి బాగా నచ్చాయని సమాచారం. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకి హైలైట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది.
 
 మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. సమర్పణలో పీఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘గురు’లో ఓల్డ్ ఏజ్డ్ బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకీ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, అందులో వెంకటేశ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సూపర్ అంటున్నారు ప్రేక్షకులు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement