బాహుబలి ఫ్యాన్స్ను హర్ట్ చేశాడు..! | Gunasekhar wishes hurting Baahubali fans | Sakshi
Sakshi News home page

బాహుబలి ఫ్యాన్స్ను హర్ట్ చేశాడు..!

Apr 30 2017 1:30 PM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి ఫ్యాన్స్ను హర్ట్ చేశాడు..! - Sakshi

బాహుబలి ఫ్యాన్స్ను హర్ట్ చేశాడు..!

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి యూనిట్పై సినీ వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రశంసల

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి యూనిట్పై సినీ వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ లిస్ట్లో టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కూడా చేరాడు. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను ప్రశంసిస్తూ స్వహస్తాలతో ఓ లెటర్ రాసిన గుణశేఖర్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కీర్తిస్తూ తన సోషల్ మీడియా పేజ్లో కామెంట్ చేశాడు.అయితే ఈ కామెంటే ఇప్పుడు బాహుబలి ఫ్యాన్స్ను హర్ట్ చేసింది.

సినిమా అనేది ఎంతటి బలమైన మీడియమో మరోసారి నిరూపించినందుకు శుభాకాంక్షలన్న గుణశేఖర్, ఓ మామూలు కథను కూడా మీ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో గొప్పగా చిత్రీకరించినందుకు హాట్సాఫ్ అంటూ కామెంట్ చేశాడు. కేవలం విజయేంద్ర ప్రసాధ్ అందించిన కథ, ఆయన సృష్టించిన పాత్రల వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని బాహుబలి యూనిట్ చెపుతున్న తరుణంలో గుణశేఖర్ ఆ కథను సింపుల్ స్టోరి అంటూ తేల్చేయటం రాజమౌళి, ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ కామెంట్స్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement