ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి | Great opportunity for manchu lakshmi working with K Raghavendar rao in 'Doosukeltha' Movie | Sakshi
Sakshi News home page

ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి

Published Fri, Sep 27 2013 1:54 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి - Sakshi

ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా : మంచు లక్ష్మి

షిర్డీసాయి, ఇంటింటా అన్నమయ్య చిత్రాల పుణ్యమా అని కొన్నాళ్లుగా ఆధ్యాత్మికానందంలోనే ఉండిపోయిన దర్శకేంద్రుడు... మళ్లీ తన శైలిలోకి వచ్చేశారు. తనలోని మాస్ యాంగిల్ తడాకా ఏంటో చూపించే పనిలో ఉన్నారాయన.

షిర్డీసాయి, ఇంటింటా అన్నమయ్య చిత్రాల పుణ్యమా అని కొన్నాళ్లుగా ఆధ్యాత్మికానందంలోనే ఉండిపోయిన దర్శకేంద్రుడు... మళ్లీ తన శైలిలోకి వచ్చేశారు. తనలోని మాస్ యాంగిల్ తడాకా ఏంటో చూపించే పనిలో ఉన్నారాయన. ఇంతకీ కె.రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తోంది ఏ సినిమాకు అనుకుంటున్నారా? మంచు విష్ణు కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో ‘దూసుకెళ్తా’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.
 
 హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ మిగిలివున్న పాటను మంచు ఫ్యామిలీ రిక్వెస్ట్ మేరకు రాఘవేంద్రరావు డెరైక్ట్ చేస్తున్నారు. ‘మాస్’ అనే పదానికి పర్యాయపదమైన దర్శకేంద్రుడు... ఈ పాటను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరో విషయం ఏంటంటే... ఈ ప్రత్యేకగీతంలో నర్తించే అవకాశాన్ని మంచు లక్ష్మి కొట్టేశారు. 
 
 తమ్ముడి ఇంట్రడక్షన్ సాంగ్‌లో అక్క అడుగు కదపనున్నారన్నమాట. పాటలను తెరకెక్కించడంలో కె.రాఘవేంద్రరావు స్పెషలిస్ట్. అందుకే ఆయన తీసే పాటలో నర్తించడానికి కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ విధంగా మంచు లక్ష్మికి ఇది నిజంగా గొప్ప అవకాశమే. ‘ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా’ అనే ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మంచు విష్ణు చెబుతున్నారు. శనివారం పాటలను, అక్టోబర్ 11న సినిమాను విడుదల చేస్తామని విష్ణు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement