గోపాల గోపాల సెన్సార్ వాయిదా | Gopala Gopala release date announcement on 10th | Sakshi
Sakshi News home page

గోపాల గోపాల సెన్సార్ వాయిదా

Jan 8 2015 3:04 AM | Updated on Mar 22 2019 5:33 PM

గోపాల గోపాల సెన్సార్ వాయిదా - Sakshi

గోపాల గోపాల సెన్సార్ వాయిదా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమా విడుదల తేదీని ఈ నెల 10న గానీ, 11న గానీ అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమా విడుదల తేదీని ఈ నెల 10న గానీ, 11న గానీ అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాకు బుధవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాలసి ఉంది.  అనుకోని కారణాల వల్ల సెన్సార్ వాయిదా పడింది. దాంతో  సినిమా  9న విడుదలయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఈ సినిమాకు రేపు అంటే 8వ తేదీన సెన్సార్ జరుగుతుంది. 11, 14 తేదీల మధ్యలో  ఏదో ఒక తేదీన  విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో 'గోపాల గోపాల'గా పునర్ నిర్మించిన విషయం తెలిసిందే. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పాత్రను వెంకటేష్ పోషించారు. ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలైంది. ఇందులోని  మూడు పాటలకూ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

 ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళీ పోషించిన దొంగ స్వామీజీ పాత్ర హైలెట్గా నిలుస్తుందని అంటున్నారు.  ఈ పాత్రలో పోసాని కామెడీ బాగా పండించినట్లు చెబుతున్నారు. వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ సినిమాపై  ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంరేపుతోంది. దీనిని చూసిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. తెలుగులో అత్యధిక హిట్లు వచ్చిన ట్రైలర్గా కూడా ఇది నిలిచింది. కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు  డి.సురేష్‌ బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement