వర్మ జీఎస్టీ మళ్లీ గ్రాండ్‌ రిలీజ్‌ | GodSexTruth and grandly releasing it tomorrow | Sakshi
Sakshi News home page

Jan 26 2018 10:03 PM | Updated on Jan 26 2018 10:14 PM

GodSexTruth and grandly releasing it tomorrow  - Sakshi

రాంగోపాల్‌ వర్మ, మియామాల్కోవా

సాక్షి, సినిమా : వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని మళ్లీ శనివారం గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించాడు. 26న (శుక్రవారం)  ఉదయం 9 గంటలకే విడుదల కావాల్సి ఉండగా.. ఆత్రుతతో ఉన్న లక్షలాది మంది ఒకేసారి ఎగబడిపోవటంతో వీడియో క్రాష్‌ అయిపోయింది. దీంతో అప్‌గ్రేడ్‌ చేసే నిమిత్తం విడుదలను నిలిపివేశారు. అయితే సమస్య పరిష్కారమైందని రేపు గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తామని వర్మ ట్వీటర్‌లో పేర్కొన్నాడు.

‘స్ట్రయిక్‌ ఫోర్స్‌ సర్వర్‌ సమస్యను పరిష్కరించింది. 27న(రేపు) ఉదయం 9 గంటలకు గాడ్‌సెక్స్‌ట్రూత్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతోంది. ప్రతి ఒక్కరు మియామాల్కోవాను చూస్తూ కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలని’ ట్వీట్‌ చేశాడు.

ఇక మరోవైపు సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఆర్జీవీపై సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement