చాలా టెన్షన్ పడ్డాను! | Glamorous roles in Supreme : Raashi Khanna | Sakshi
Sakshi News home page

చాలా టెన్షన్ పడ్డాను!

May 3 2016 1:12 AM | Updated on Sep 2 2018 5:18 PM

చాలా టెన్షన్ పడ్డాను! - Sakshi

చాలా టెన్షన్ పడ్డాను!

‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ‘బెంగాల్ టైగర్’ వరకూ పక్కింటి అమ్మాయి పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్ చేశారు రాశీఖన్నా.

‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ‘బెంగాల్ టైగర్’ వరకూ పక్కింటి అమ్మాయి పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్ చేశారు రాశీఖన్నా. ఈ 5న విడుదల కానున్న ‘సుప్రీమ్’లో పోలీసాఫీసర్‌గా నటించారు. ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ - ‘‘డెరైక్టర్ అనిల్ పోలీసాఫీసర్ పాత్ర గురించి చెప్పగానే ‘నేనా? కామెడీనా?’ అని భయపడ్డా. చేయడం మొదలుపెట్టాక ఆ భయం పోయింది. ఇందులో నా పాత్ర పేరు బెల్లం శ్రీదేవి. స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ అని పేరు తెచ్చుకోవడానికి ఆమె పడే పాట్లు కడుపుబ్బ నవ్విస్తాయి. నవ్వించడమే కాదు... రౌడీలను తుక్కు రేగ్గొట్టే సీన్స్ కూడా ఉన్నాయి.

గతంలో చిరంజీవి గారు, రాధ చేసిన ‘అందం హిందోళం...’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చేసే ముందు ఆ పాట చూశా. ప్రతి ఫ్రేమ్‌లోనూ చిరంజీవి గారితో రాధగారికి స్టెప్స్ ఉన్నాయి. దాంతో టెన్షన్ అనిపించింది. చేయగలనా? అని భయ పడ్డా. సెట్‌లో చాలా సెలైంట్‌గా ఉండే సాయిధరమ్ కెమెరా ముందుకు రాగానే రెచ్చిపోతాడు. అతని డ్యాన్స్ చూసి నేనూ భయం లేకుండా చేసేశా. అందరూ బాగా చేశావని మెచ్చుకున్నారు’’ అని చెప్పారు. ఖాళీగా ఉన్నప్పుడు కవితలు రాస్తుంటాననీ, వాటిని పుస్తకరూపంలో తీసుకురావాలనుకుంటున్నాననీ రాశీఖన్నా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement