పిల్ల రాక్షసి సాహసం | Get ready for a heart touching Pilla Rakshasi | Sakshi
Sakshi News home page

పిల్ల రాక్షసి సాహసం

Sep 17 2016 12:23 AM | Updated on Sep 4 2017 1:45 PM

పిల్ల రాక్షసి సాహసం

పిల్ల రాక్షసి సాహసం

ఇటీవల ‘బిచ్చగాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాత చదలవాడ పద్మావతి ‘పిల్ల రాక్షసి’

 ఇటీవల ‘బిచ్చగాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాత చదలవాడ పద్మావతి ‘పిల్ల రాక్షసి’ పేరుతో మరో చిత్రాన్ని అందించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఆన్ మరియ కలిప్పిలాను’ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై ‘పిల్ల రాక్షసి’ పేరుతో ఆమె తెలుగులో విడుదల చేస్తున్నారు. సారా అర్జున్ టైటిల్  పాత్రలో నటించగా, ‘ఓకే బంగారం’ ఫేం దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్ర చేశారు.
 
 మిథున్ మాన్యూల్ థామస్ దర్శకత్వంలో తెరకె క్కిందీ చిత్రం. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ మోసగాడితో చిన్నారి ఎటువంటి సాహసం చేసింది? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వైవిధ్యమైన ఈ కథను దర్శకుడు సహజంగా తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది.  ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

పోల్

Advertisement