స్టార్ డైరెక్టర్ చేతికి పెళ్లిచూపులు రీమేక్ రైట్స్ | Gautham Menon buys Pelli Choopulu Tamil remake rights | Sakshi
Sakshi News home page

స్టార్ డైరెక్టర్ చేతికి పెళ్లిచూపులు రీమేక్ రైట్స్

Oct 25 2016 2:15 PM | Updated on Sep 4 2017 6:17 PM

స్టార్ డైరెక్టర్ చేతికి పెళ్లిచూపులు రీమేక్ రైట్స్

స్టార్ డైరెక్టర్ చేతికి పెళ్లిచూపులు రీమేక్ రైట్స్

చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా పెళ్లి చూపులు. కేవలం కోటిన్నర బడ్జెట్లో రాజ్ కందుకూరి నిర్మాతగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్...

చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా పెళ్లి చూపులు. కేవలం కోటిన్నర బడ్జెట్లో రాజ్ కందుకూరి నిర్మాతగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లిచూపులు 20 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది.

ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచే రీమేక్ రైట్స్కు భారీ క్రేజ్ ఏర్పడింది. పలువురు టాప్ సెలబ్రిటీలు రైట్స్ కోసం ప్రయత్నించగా హిందీ రీమేక్ రైట్స్ను వశు భగ్నానీ సొంతం చేసుకున్నారు. తాజాగా తమిళ రీమేక్ రైట్స్ను కూడా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దక్కించుకున్నారు. దర్శకుడిగానే కాక నిర్మాతగాను పలు విజయవంతమైన చిత్రాలను అందించిన గౌతమ్ మీనన్, ఈ సినిమాను తన నిర్మాణంలో మరో దర్శకుడితో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement