నవ్వులు ఖాయం! | Full Guarantee full comedy Movie | Sakshi
Sakshi News home page

నవ్వులు ఖాయం!

Apr 16 2015 10:46 PM | Updated on Sep 3 2017 12:23 AM

నవ్వులు ఖాయం!

నవ్వులు ఖాయం!

జ్వాల, మౌనిక జంటగా బొత్స రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫుల్ గ్యారెంటీ’. యల్లమిల్లి

జ్వాల, మౌనిక జంటగా బొత్స రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫుల్ గ్యారెంటీ’. యల్లమిల్లి బాలమురళీ కృష్ణ సమర్పణలో యల్లమిల్లి సాయి సూర్యతేజ, కె. సాయిగిరి నిర్మించిన ఈ చిత్రానికి చిన్ని చరణ్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో సీడీని హీరో నందు ఆవిష్కరించి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌కి ఇచ్చారు. ఈ వేడుకలో జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రవికుమార్, నిర్మాత సంగిశెట్టి దశరథ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఒక మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం. లవ్వుకి నవ్వు అనేది ఉపశీర్షిక. చిత్రం కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. మా గురువుగారు జయంత్ రెడ్డి మా మీద అభిమానంతో ఈ చిత్రంలో నటించారు. చిన్ని చరణ్ అద్భుతమైన పాటలిచ్చారు’’ అని చెప్పారు.
 

Advertisement

పోల్

Advertisement