breaking news
MLC Ramulu Nayak
-
‘ఉత్తమ్ మతి లేకుండా మాట్లాడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్ లో కూర్చొని పీసీ సీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నార ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఉత్తమ్ మతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశారని, పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అప్పుడు ఎందుకు పెంచలేదని నిలదీశారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, ఆదివాసీల ఉద్యమం వెనుక ఉన్న సోయం బాబూరావు, ఆత్రం సక్కు వంటి వారు ఏ పార్టీకి చెందినవారో అందరికీ తెలుసునని రాములు నాయక్ అన్నారు. నాయీల వృత్తి నైపుణ్యానికి రూ.250 కోట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: నాయీ బ్రాహ్మణులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అత్యాధునిక శిక్షణ అవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో నాయీ బ్రాహ్మణుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కుల వృత్తిదారులు రాణించాలంటే పరిస్థితులకు అనుగుణంగా వృత్తిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. -
నవ్వులు ఖాయం!
జ్వాల, మౌనిక జంటగా బొత్స రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫుల్ గ్యారెంటీ’. యల్లమిల్లి బాలమురళీ కృష్ణ సమర్పణలో యల్లమిల్లి సాయి సూర్యతేజ, కె. సాయిగిరి నిర్మించిన ఈ చిత్రానికి చిన్ని చరణ్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో సీడీని హీరో నందు ఆవిష్కరించి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌కి ఇచ్చారు. ఈ వేడుకలో జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రవికుమార్, నిర్మాత సంగిశెట్టి దశరథ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఒక మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం. లవ్వుకి నవ్వు అనేది ఉపశీర్షిక. చిత్రం కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. మా గురువుగారు జయంత్ రెడ్డి మా మీద అభిమానంతో ఈ చిత్రంలో నటించారు. చిన్ని చరణ్ అద్భుతమైన పాటలిచ్చారు’’ అని చెప్పారు.