'ఆ సినిమా చూడటం అదృష్టం'

'ఆ సినిమా చూడటం అదృష్టం'

తనకు పిల్లనిచ్చిన మేనమామ నందమూరి బాలకృష్ణ నటించిన నూరో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా అమరావతి చరిత్రను మరోసారి చూడటం అదృష్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సినిమా ప్రీమియర్‌ను చూశానని, దర్శకుడు క్రిష్ చాలా అద్భుతంగా తీశారని చెప్పారు. 

 

అందులోనూ బాలయ్య మావయ్య స్ఫూర్తిదాయకమైన పెర్ఫామెన్స్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానన్నారు. సినిమాలో నటించిన ఇతరుల గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిందేనని ట్వీట్ చేశారు. ఇక శాతకర్ణి సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని.. నోరప్పగించి సినిమా అలా చూస్తుండిపోయానని బాలకృష్ణ కుమార్తె, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. దర్శకుడు క్రిష్‌కు అభినందనలు తెలిపారు.

Back to Top