దర్శకుడి హత్యకు కుట్ర, మోడల్‌కు జైలు | For Plotting To Kill Filmmaker Madhur Bhandarkar, Model Sent To Jail | Sakshi
Sakshi News home page

దర్శకుడి హత్యకు కుట్ర, మోడల్‌కు జైలు

Apr 28 2017 2:46 PM | Updated on Sep 5 2017 9:55 AM

దర్శకుడి హత్యకు కుట్ర, మోడల్‌కు జైలు

దర్శకుడి హత్యకు కుట్ర, మోడల్‌కు జైలు

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌ను హత్య చేయించడానికి కుట్ర పన్నిన కేసులో ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌ను ముంబై కోర్టు దోషీగా నిర్ధారించింది.

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌ను హత్య చేయించడానికి కుట్ర పన్నిన కేసులో ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌ను ముంబై కోర్టు దోషీగా నిర్ధారించింది. ఈ కేసులో ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుట్రలో ఆమెకు సాయపడిన నరేష్‌ పరదేశీ, శివరామ్‌ దాస్‌లకు కూడా కోర్టు మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.

2005లో మాధుర్‌ భండార్కర్‌ను హత్య చేయించడానికి గ్యాంగ్‌ స్టర్‌ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేష్‌ పరదేశీతో ప్రీతి ఒప్పందం చేసుకుంది. నరేష్‌కు ఆమె 75 వేల రూపాయలు ఇచ్చింది. కాగా భండార్కర్‌ను నరేష్‌ హత్య చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కు ఇవ్వాల్సిందిగా ఆమె డిమాండ్‌ చేసింది. ఈ విషయం అరుణ్‌ గావ్లీకి తెలియడంతో పోలీసులను అప్రమత్తం చేశాడు. ప్రీతితో పాటు ఆమెకు సహకరించిన నరేష్‌, శివరామ్‌లపై కేసు నమోదు చేశారు. భండార్కర్‌ హత్యకు ఈ ముగ్గురు కుట్ర పన్నారని కోర్టులో తేలడంతో శిక్ష విధించింది.

ఇదిలావుండగా 2006లో ప్రీతి.. భండార్కర్‌పై రేప్‌ కేసు పెట్టింది. తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి భండార్కర్‌ తనను శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా 2012లో భండార్కర్‌పై చేసిన అభియోగాలను ప్రీతి ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది. పేజ్‌ 3, ట్రాఫిక్ సిగ్నల్‌, ఫ్యాషన్, చాందినీ బార్‌ వంటి సినిమాలను భండార్కర్‌ తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement