breaking news
plotting to kill
-
హైదరాబాద్‌లో నివాసానికి వరవరరావు
హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావును పూణె నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది. వరవరరావును ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే పూణెకు చెందిన నలుగురు పోలీసులు వరవరరావు ఇంటి వద్ద ప్రత్యేకంగా కాపలాగా ఉన్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు. వరవర రావుపై ఆందోళన వద్దు: హైకోర్టు నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ -
దర్శకుడి హత్యకు కుట్ర, మోడల్‌కు జైలు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్‌ను హత్య చేయించడానికి కుట్ర పన్నిన కేసులో ముంబై మోడల్ ప్రీతి జైన్‌ను ముంబై కోర్టు దోషీగా నిర్ధారించింది. ఈ కేసులో ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుట్రలో ఆమెకు సాయపడిన నరేష్ పరదేశీ, శివరామ్ దాస్‌లకు కూడా కోర్టు మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. 2005లో మాధుర్ భండార్కర్‌ను హత్య చేయించడానికి గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేష్ పరదేశీతో ప్రీతి ఒప్పందం చేసుకుంది. నరేష్‌కు ఆమె 75 వేల రూపాయలు ఇచ్చింది. కాగా భండార్కర్‌ను నరేష్ హత్య చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కు ఇవ్వాల్సిందిగా ఆమె డిమాండ్ చేసింది. ఈ విషయం అరుణ్ గావ్లీకి తెలియడంతో పోలీసులను అప్రమత్తం చేశాడు. ప్రీతితో పాటు ఆమెకు సహకరించిన నరేష్, శివరామ్‌లపై కేసు నమోదు చేశారు. భండార్కర్ హత్యకు ఈ ముగ్గురు కుట్ర పన్నారని కోర్టులో తేలడంతో శిక్ష విధించింది. ఇదిలావుండగా 2006లో ప్రీతి.. భండార్కర్‌పై రేప్ కేసు పెట్టింది. తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి భండార్కర్ తనను శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా 2012లో భండార్కర్‌పై చేసిన అభియోగాలను ప్రీతి ఉపసంహరించుకోవడంతో కోర్టు ఈ కేసును కొట్టేసింది. పేజ్ 3, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్, చాందినీ బార్ వంటి సినిమాలను భండార్కర్ తీశారు.