అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ని మరెవరూ టచ్‌ చేయలేరు: టాప్‌ డైరెక్టర్‌ | Bollywood Director Madhur Bhandarkar Interesting Comments On Allu Arjun Stardom, Deets Inside | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ని మరెవరూ టచ్‌ చేయలేరు..తేల్చేసిన టాప్‌ డైరెక్టర్‌

Jul 2 2025 2:05 PM | Updated on Jul 2 2025 3:16 PM

Madhur Bhandarkar Interesting Comments On Allu Arjun

పుష్ప2 సినిమా అల్లు అర్జున్‌(Allu Arjun) స్టార్‌డమ్‌ని ఆకాశానికి చేర్చిందనేది తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది టాప్‌ స్టార్స్‌ ఉండగా ఒక్కసారిగా వీరందరినీ మన బన్నీ దాటేశాడు.  తన తదుపరి సినిమాకి ఏకంగా రూ.300కోట్ల రెమ్యునరేషన్‌ అందుకుంటున్నాడనే వార్త టాప్‌ బాలీవుడ్‌ స్టార్స్‌కి కూడా దిమ్మదిరిగిపోయేలా షాక్‌ ఇచ్చింది. ఓ వైపు ఎంతో కాలంగా ఇంటర్నేషనల్‌ స్టార్స్‌గా వెలుగొందుతున్న ఎందరో బాలీవుడ్‌ హీరోలు, మరోవైపు ఇటీవలే గ్లోబల్‌ స్టార్స్‌గా మారిన దక్షిణాది హీరోలు.. మరి వీరందరిలో భవిష్యత్తులో బన్నీని బీట్‌ చేయగల హీరో ఎవరు? అనే ప్రశ్నలు చర్చలు చోటు చేసుకుంటున్నాయి.  ఈ నేపధ్యంలోనే అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ని బీట్‌ చేయడం ఇప్పట్లో మరెవరికీ సాధ్యం కాదు ఓ టాప్‌ డైరెక్టర్‌ తేల్చేయడం విశేషం.

ఆయన కూడా సాదా సీదా హిందీ సినిమాల దర్శకుడేమీ కాదు అనేక హిట్‌ చిత్రాలు అందించిన అగ్రగామి బాలీవుడ్‌ దర్శకుడు మధర్‌ భండార్కర్‌(Madhur Bhandarkar). తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ‘‘సమీప రోజుల్లో, ఎవ్వరూ కూడా అల్లూ అర్జున్‌ దక్కించుకున్న క్రేజ్‌ను కనీసం తాకలేరు. ఆయన నిజమైన పాన్‌ఇండియా స్టార్‌’’ అని మధుర్‌ భండార్కర్‌ అన్నారు. అంతేకాదు.. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన  తీరు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్‌ భారీగా మాస్‌ ఆకర్షణను సంపాదించి పెట్టిందని ప్రాంతాలకతీతంగా అల్లు అర్జున్‌ను ప్రేక్షకులతో కనెక్ట్‌ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

పుష్ప సినిమా విజయం గతంగా మారిపోయినా ఇప్పటికీ అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తున్న వారి జాబితా అంతకంతకూ పెరిగిపోతుండడం విశేషం. బన్నీని ఆకాశానికి ఎత్తేస్తున్న బాలీవుడ్‌ ప్రముఖుల్లో మధుర్‌ భండార్కర్‌ మాత్రమే కాదు అల్లు అర్జున్‌ మాత్రమే పుష్ప చేగలడంటూ బాలీవుడ్‌ టాప్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అన్నాడు.  అతని ఎనర్జీ ఎక్స్‌ట్రార్డినరీ అంటూ యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ పొగిడితే...ఐకాన్‌స్టార్‌తో ఒక్కసినిమాలో అయినా నటించాలని ఉందని బాలీవుడ్‌ నటి అనన్య పాండే తపిస్తున్నారు.  

అతని లాంటి డ్యాన్సర్‌ని చూడలేదని టాప్‌ కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ తేల్చేశారు.  ఆయన ఎనర్జీ మరెవరికీ సాధ్యం కాదు అని బాలీవుడ్‌లో ఎనర్జిటిక్‌ హీరోగా పేరున్న  షాహిద్‌ కపూర్‌ ఒప్పేసుకున్నాడు.  అతనో స్టైల్‌ ఐకాన్‌ అంటూ మరో బాలీవుడ్‌ స్టార్‌ రణవీర్‌ సింగ్‌లు...అభివర్ణించాడు. ఇలా ఎందరో బన్నీపై భారీ స్థాయిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానున్న అల్లు అర్జున్‌ అట్లీల సినిమా పై అంచనాలను వీరి అభిప్రాయాలు మరింతగా పెంచేస్తున్నాయనేది నిజం. ఈ నేపధ్యంలో ఆ స్థాయి అంచనాలను అందుకోవడానికి బన్నీ అట్లీ ద్యయం మరింతగా కృషి చేయకతప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement