సమంతకు నచ్చిన లేడీ! | First Look of Vijay Sethupathi as Transgender in Super Deluxe Tamil ... | Sakshi
Sakshi News home page

సమంతకు నచ్చిన లేడీ!

Sep 17 2017 12:11 AM | Updated on Sep 19 2017 4:39 PM

సమంతకు నచ్చిన లేడీ!

సమంతకు నచ్చిన లేడీ!

ఈ ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? తమిళ హీరో విజయ్‌ సేతుపతి.

ఈ ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? తమిళ హీరో విజయ్‌ సేతుపతి. తమిళం నుంచి తెలుగులో డబ్‌ అయిన ‘పిజ్జా’తో ఇక్కడి ప్రేక్షకులకు మంచి హారర్‌ థ్రిల్లర్‌ రుచి చూపించిన హీరోయే! ఇప్పుడీ హీరోగారు ‘సూపర్‌ డీలక్స్‌’ అనే తమిళ సిన్మాలో శిల్ప అనే లేడీగా కనిపించనున్నారట. కొందరేమో... లేడీ కాదు, ట్రాన్స్‌జెండర్‌ అంటున్నారు.

లేడీనా? ట్రాన్స్‌జెండరా? అనేది చెప్పకుండా ‘శిల్ప ఫ్రమ్‌ సూపర్‌డీలక్స్‌’ అని చిత్రదర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజ ఈ లుక్‌ రిలీజ్‌ చేశారు. సమంత దగ్గర్నుంచి చాలామంది ప్రముఖులు ఈ గెటప్‌ చూసి ‘సెమ్మా మాస్‌’ అని అభినందిస్తున్నారు. అంటే.. సూపర్‌ మాస్‌ అని అర్థం. సమంతతో పాటు మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్, గాయత్రి, నదియా ఈ ‘సూపర్‌ డీలక్స్‌’లో నటిస్తున్నా రు. ఆ సంగతలా ఉంచితే.. ఈ గెటప్‌ కోసం విజయ్‌ సేతుపతి చాలానే కష్టపడుతున్నారట. మరి.. చీరకట్టా? మజాకా?

Advertisement
 
Advertisement
Advertisement