తొలి బాండ్‌ గాళ్‌ ఇక లేరు

First James Bond girl Eunice Gayson dies at 90 - Sakshi

జేమ్స్‌ బాండ్‌ చిత్రాల్లో అలరించిన తొలి బాండ్‌ గాళ్‌ యూనిస్‌ గైసన్‌(90) కన్నుమూశారు.  అనారోగ్యంతో శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 1962లో జేమ్స్‌ బాండ్‌  సీన్‌కానరీ చిత్రం డాక్టర్ నో   చిత్రంలో నటించి తొలి జేమ్స్‌ బాండ్‌ గాళ్‌గా  పేరు పొందారు.   డాక‍్టర్‌  నో, ఫ్రం రష్యా విత్ లవ్ చిత్రాల్లో నటించిన బాండ్‌ గాళ్‌ కన్నుమూశారని మైఖేల్ జి విల్సన్ ,  బార్బరా బ్రకోలీ, బాండ్ సిరీస్  నిర్మాతలు ఒక ప్రకటనలో  వెల్లడించారు. దీంతో ట్విటర్‌లో  గైసన్‌ మృతిపై  సంతాపం సందేశాలు వెల్లువెత్తాయి.

గేసన్ 1928 లో సుర్రేలో జన్మించారు. తొలి బాండ్‌ గర్ల్‌గా అవతరించక ముందు ఆమె 1958లో  రివెంజ్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టీన్‌ సహా అనేక హారర్‌ సినిమాల్లో కనిపించారు.  అలాగే  బాండ్‌ చిత్రాల అనంతరం  ది సెయింట్ ,  ది ఎవెంజర్స్ లాంటి  టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top