ఓ.కె.... మణిరత్నం | Filmmaker Mani Ratnam admitted to hospital due to cardiac problems | Sakshi
Sakshi News home page

ఓ.కె.... మణిరత్నం

May 6 2015 10:34 PM | Updated on Oct 9 2018 5:00 PM

ఓ.కె.... మణిరత్నం - Sakshi

ఓ.కె.... మణిరత్నం

మేం బాగానే ఉన్నాం’ అన్నారు నటి సుహాసినీ మణిరత్నం. దర్శకుడు మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనీ,

‘మేం బాగానే ఉన్నాం’ అన్నారు నటి సుహాసినీ మణిరత్నం. దర్శకుడు మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనీ, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.  ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మణిరత్నంకు  గుండెపోటు వచ్చిందనే వార్త ప్రచారమైంది. ఈ వార్తల్లో నిజం లేదని సుహాసిని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లామనీ, అంతకు మించి ఏమీ లేదనీ ఆమె స్పష్టం చేశారు. తదుపరి చిత్రానికి కథ సిద్ధమవుతోందని ఆమె పేర్కొన్నారు. మణితో కలిసి, తాను దిగిన తాజా ఫోటో ట్విట్టర్‌లో పొందుపరిచి, ‘ఉయ్ ఆర్ ఓకే’ అని సుహాసిని పెట్టారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement