మణిరత్నం, సుహాసినిల కొడుకుని చూశారా? ఏం చేస్తాడో తెలుసా? | Interesting Facts About Maniratnam. Suhasini Son Nandan Maniratnam | Sakshi
Sakshi News home page

మణిరత్నం కొడుకు ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తాడో తెలుసా?

May 10 2026 9:01 AM | Updated on May 10 2026 11:16 AM

Interesting Facts About Maniratnam. Suhasini Son Nandan Maniratnam

ప్రఖ్యాత సినీ దర్శకుడు మణిరత్నం, ఇక ఆయన సతీమణి నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిమణి. అయితే వీరి పుత్ర రత్నం గురించి చెప్పే తీరాలి. దర్శకుడు మణిరత్నం, నటి సుహాసినిల వివాహం 1988లో జరిగింది. వీరి ఏకై క పుత్రుడి పేరు నందన్‌.

మణిరత్నం, సుహాసిని దంపతులకు ఒక కొడుకు ఉన్న సంగతి తెలుసుగానీ అతను ఎలా ఉంటాడో అన్న విషయం ఎవరికీ తెలియదు. ఈయన తల్లిదండ్రులు ప్రముఖ సినీ దంపతులు అయినా, నందన్‌ మాత్రం ఏ సినీ కార్యక్రమంలో కనిపించాడు. 

లండన్‌లోని ఆక్స్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో. మనో శాస్త్రం, రాజకీయం శాస్త్రానికి సంబంధించిన విద్యను అభ్యసించిన నందన్‌ ఆరంభ కాలం నుంచే రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూస్తూ వచ్చాడని ఆమె తల్లి, నటి సుహాసిని ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఆమె పేర్కొంటూ నందన్‌ కమ్యూనిస్టు భావాజాలం ఉన్న వ్యక్తి అని చెప్పారు. తను 15 వయసులోనే లెనినిజంతో కూడిన కంటోర్స్‌ ఆఫ్‌ లెనినిజం అనే చిరు కథను రాశాడని చెప్పారు. అంతటితో నందన్‌ రాజకీయ ఆసక్తి ఆగలేదు అన్నారు. 

ఇతర పిల్లల మాదిరిగా కాకుండా నందన్‌ పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్లో జరిగే చర్చలను ఆసక్తిగా వినేవాడు అన్నారు. 12 ఏళ్ల వయసులోనే కార్ల్‌ మార్క్స్‌ రాసిన మూలధనం పుస్తకాన్ని చదివేవాడన్నారు. అలాంటి ఒక పుస్తకాన్ని తీసుకొని కేరళలోని సీపీఎం కార్యాలయానికి వెళ్లాడు అన్నారు. అక్కడ తాను కార్లో వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదని, కారును వేరే ప్రాంతంలో నిలిపి పార్టీ కార్యాలయానికి వెళ్లాడన్నారు. అక్కడ నందన్‌ చూసినవారు ఎవరు నువ్వు ? అని అడక్కుండా బోంచేసావా అని హరి గారు అన్నారు. అదే కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకత అని సుహాసిని పేర్కొన్నారు. 

భోజనానంతరం సీపీఎం పార్టీ కార్యదర్శిని కలిసి మాట్లాడాడని చెప్పారు. కాగా తన పేరు అడిగినప్పుడు దర్శకుడు మణిరత్నం పేరు వాడితే తానెవరో తెలిసిపోతుంది అని ఆయన అసలు పేరు గోపాల్‌ రత్నం సుబ్రహ్మణ్యం కొడుకు అ ని చెప్పేది అన్నారు. అయితే తన పేరు మాత్రం సుహాసిని చెప్పడంతో తను తమ కొడుకా అందరికీ తెలిసిందన్నారు. ఆ సంఘటన తర్వాత నందన్‌ సీపీఎం పార్టీ సభ్యుడిగా మారిపోయాడని నటి సుహాసిని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement