హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

Famous Hollywood Comedian John Witherspoon Died - Sakshi

లాస్‌ఏంజిల్స్‌: ప్రముఖ నటుడు, కమెడియన్‌, 'ఫ్రైడే' చిత్రంలో ఐస్‌క్యూబ్‌ తండ్రిగా అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించిన జాన్ విథర్‌స్పూన్ (77) మంగళవారం తుదిశ్వాస విడిచారు. విథర్‌స్పూన్ లాస్‌ఏంజిల్స్‌లో మరణించారని ఆయన మేనేజర్‌ అలెక్స్ గుడ్‌మన్ తెలిపారు. విథర్‌స్పూన్ మరణంతో కుటుంబసభ్యులు షాక్‌లో ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు ఫ్రైడే పేరుతో తెరకెక్కిన మూడు చిత్రాల్లో నటించిన ఆయన తన కెరీర్‌ను హాలీవుడ్‌లో రాణించారు.

'ది వయాన్స్ బ్రదర్స్' టెలివిజన్‌ సీరిస్‌తో పాటు 'ది  బూండాక్స్' అనే ఎనిమేటేడ్‌ సినిమాకు వాయిన్‌ ఇచ్చారు. అంతేకాక 'వాంపైర్ ఇన్ బ్రూక్లిన్, బూమేరాంగ్' వంటి చిత్రాల్లో చెప్పుకోదగ్గ పాత్రాలు చేశారు. తాను ఎన్ని చిత్రాల్లో నటించినా హాస్యప్రియులు తనను ఫ్రైడే సినిమాలోని ఐస్‌క్యూబ్‌ తండ్రి 'పాప్స్‌'గా మాత్రం ఎక్కువగా గుర్తించారు. ప్రేక్షకులపై 'పాప్స్‌'గా విథర్‌స్పూన్‌ చెరిగిపోనిముద్ర వేశారు. విథర్‌స్పూన్‌ హఠాన్మరణం విని దిగ్భ్రాంతికి లోనయ్యానని నటుడు ఐస్‌క్యూబ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. జనవరి 27, 1942న జన్మించిన విథర్‌స్పూన్‌కు భార్య ఏంజెలా, కుమారులు జేడీ, అలెగ్జాండర్ ఉన్నారు. ' మా మధ్య బంధం తండ్రి, కొడుకు కన్నా ఎక్కువగా ఉండేది. నాన్న నాకు మంచి స్నేహితుడు, నా స్పూర్తి. లవ్ యు డాడ్ ... నిన్ను మిస్ అవుతాను' అని విథర్‌స్పూన్‌ కొడుకు జేడీ  ట్వీట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top