అతగాడితో విహార యాత్ర! | Expedition with him! | Sakshi
Sakshi News home page

అతగాడితో విహార యాత్ర!

May 28 2015 11:10 PM | Updated on Sep 3 2017 2:50 AM

అతగాడితో విహార యాత్ర!

అతగాడితో విహార యాత్ర!

‘‘ఒంటరిగా విహార యాత్రకు వెళ్లినా... జంటగా వెళ్లిందని జనాలు చెప్పుకునే రోజులివి. ఫలానా కథానాయిక విహార యాత్రకెళ్లిందట అనే వార్త వస్తే చాలు..

 ‘‘ఒంటరిగా విహార యాత్రకు వెళ్లినా... జంటగా వెళ్లిందని జనాలు చెప్పుకునే రోజులివి. ఫలానా కథానాయిక విహార యాత్రకెళ్లిందట అనే వార్త వస్తే చాలు.. తనతో పాటు ‘అతను’ కూడా వెళ్లాడని ఏదో ఒక హీరోతో లింకు పెట్టేస్తారు’’ అని సోనాక్షీ సిన్హా అంటున్నారు.
 
 ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. ఇటీవల ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె మాల్దీవులు వెళ్లారు. అక్కడ కొంచెం విరామం దొరికితే, ఓ రెండు రోజులు విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. దాంతో, ఈ ట్రిప్‌కి సోనాక్షీ ఎవర్నో తీసుకెళ్లారనీ, అతగాడెవరనీ కొంతమంది ఆరా తీసే పని మీద పడ్డారు.
 
 ఈ విషయం విన్న సోనాక్షీ హాయిగా నవ్వుకున్నారట. ‘‘నాతో తీసుకెళ్లడానికి బాయ్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. నేను ఒంటరిగా వెళ్లా. ఇక ఆరా తీయడం ఆపితే బెటర్’’ అంటున్నారామె. ప్రస్తుత సింగిల్‌గా ఉన్నాననీ, జీవితం చాలా ఆనందంగా ఉందనీ సోనాక్షీ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement