ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం | Every Women Should Watch Jhansi Movie | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం

Aug 16 2018 5:15 AM | Updated on Aug 16 2018 5:15 AM

Every Women Should Watch Jhansi Movie - Sakshi

కల్పన

జ్యోతిక టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఝాన్సీ’. తమిళంలో ‘నాచ్చియార్‌’గా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ శుక్రవారం ‘ఝాన్సీ’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన కోనేరు కల్పన బుధవారం మీడియాతో మాట్లాడుతూ – ‘‘నాకు వ్యక్తిగతంగా జ్యోతిక గారంటే చాలా ఇష్టం. ఆమె నటన చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా తన విశ్వరూపం చూపించారామె. ‘ఝాన్సీ’ చూసిన వెంటనే మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమా లాగా అనిపించింది. అందుకే యస్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాం.  డిస్ట్రిబ్యూటర్స్‌ దగ్గర నుంచి చాలా మంచి ఆఫర్స్‌ వచ్చాయి. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు దర్శకుడు బాలా. బాలాగారికి మన తెలుగులో కూడా చాలా మంచి పేరుంది. ఆయన గత చిత్రాలు శేషు, శివపుత్రుడు, వాడు–వీడు లాగానే మా ‘ఝాన్సీ’ కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement