పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్.. | Ekta Kapoor truns mom | Sakshi
Sakshi News home page

పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్..

Jan 31 2019 3:03 PM | Updated on Jan 31 2019 3:17 PM

Ekta Kapoor truns mom - Sakshi

ఏక్తా కపూర్(43) పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యారు.

క్వీన్‌ ఆఫ్‌ హిందీ టెలివిజన్‌గా పేరుపొందిన ఏక్తా కపూర్(43) పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యారు. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్‌‌, ఎమోషనల్‌ స్టోరీస్‌ ఇలా వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్‌ అధినేత్రి ఏక్తా కపూర్‌ జనవరి 27న సరోగసి (అద్దె గర్భం) ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రముఖ నటుడు జితేంద్రకు ఏక్తా కపూర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. సరోగసి ద్వారా జితేంద్ర కుటుంబం ఓ బిడ్డకు జన్మను ప్రసాదించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏక్తా కపూర్ సోదరుడు, నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారా  ఓ బిడ్డకు తండ్రి అయ్యారు.

బడే అచ్చే లగ్తీ హై, కుమ్ కుమ్ భాగ్య, కుండలి భాగ్య, యే మోహబ్బతేన్, కసమ్,తెరే ప్యార్ కి, క్యూంకీ సాస్ బీ కబీ బహు థి సీరియల్స్‌తో ఏక్తా కపూర్ బడా నిర్మాతగా పేరొందారు. ఇక పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి ప్రొడ్యుసర్‌గా నిలదొక్కుకున్నారు. ఆమె నిర్మించిన విద్యాబాలన్ ‘ది డర్టీ పిక్చర్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్లను వసూలు చేసింది. అనంతరం రాగిణి ఎమ్మెమ్మెస్, వీర్ దే వెడ్డిండ్,హాఫ్ గర్ల్ ఫ్రెండ్ తదితర చిత్రాలను సైతం నిర్మించారు ఏక్తాకపూర్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement